Powered By Blogger

Wednesday, January 6, 2010

నీకై అన్వేషిస్తున్నా............

కడలి కెరటాలలా నిరంతరం.......ఎగసిపడుతూ  
జలపాతంలా  నిరంతరం .....ఉప్పోoగుతూ
చిరుగాలిలా నిరంతరం ........పయనిస్తూ
సెలయేరులా నిరంతరం.......అలుపెరగక పరుగులు తీస్తూ
సముడ్రుడిలా నిరంతరం......... ఘోషిస్తూ 
మనసులా నిరంతరం............ తిరుగుతూ
ఘడియలా ...........అరఘడియ అయిన విస్రమించక
నీకై అన్వేషిస్తున్నా............

Friday, January 1, 2010

ప్రకృతి పిపాసి


ప్రకృతి పిపాసినై ప్రకృతి అందాలని ఆరాధిస్తూ
ఆ సౌందర్యాని కి  పరవశించిన  మనసుతో

చిత్రకారినై ఆ సోయగాలను  నా వయ్యారి
కుంచతో చిత్రంగా ప్రాణం పోసి......  


ఆ అనుభూతుల అనుభవాలను
ఆనందపు మధురభవాలను 

అక్షరాలుగా రాసి ...
కవియిత్రినై  కవితలుగా పేర్చగా.....


యద నిండిన  సంతోషంతొ   
కవ్వించే ప్రియభవాలను
గాయనినై రాగన్ని కూర్చి
కోకిలనై మధురగానం చేస్తూ ...... 


మది మీటిన ఆ ప్రియగానానికి
పులకరించిన హృదయంతో
నర్తకినై  వగలుపోతూ  వయ్యారంగా
మయూరిలా పురివిప్పి  నాట్యమాడుతూ........ 


ఆనందపు అంచుల్ని తాకుతూ
నాలో హరివిల్లై   వెల్లువిరిసిన
ఈ సంతోషాన్ని  ఎలుగెత్తి 
ఈ లోకానికి చటుతున్నా.....