ఆ సౌందర్యాని కి పరవశించిన మనసుతో
చిత్రకారినై ఆ సోయగాలను నా వయ్యారి
కుంచతో చిత్రంగా ప్రాణం పోసి......
కుంచతో చిత్రంగా ప్రాణం పోసి......
ఆ అనుభూతుల అనుభవాలను
ఆనందపు మధురభవాలను
ఆనందపు మధురభవాలను
అక్షరాలుగా రాసి ...
కవియిత్రినై కవితలుగా పేర్చగా.....
కవియిత్రినై కవితలుగా పేర్చగా.....
యద నిండిన సంతోషంతొ
కవ్వించే ప్రియభవాలనుగాయనినై రాగన్ని కూర్చి
కోకిలనై మధురగానం చేస్తూ ......
కోకిలనై మధురగానం చేస్తూ ......
మది మీటిన ఆ ప్రియగానానికి
పులకరించిన హృదయంతో
నర్తకినై వగలుపోతూ వయ్యారంగా
మయూరిలా పురివిప్పి నాట్యమాడుతూ........
పులకరించిన హృదయంతో
నర్తకినై వగలుపోతూ వయ్యారంగా
మయూరిలా పురివిప్పి నాట్యమాడుతూ........
నాలో హరివిల్లై వెల్లువిరిసిన
ఈ సంతోషాన్ని ఎలుగెత్తి
ఈ లోకానికి చటుతున్నా.....


No comments:
Post a Comment