ఒక రోజు నేను మా పెరటిలో విరపూసిన పువ్వులను ఆస్వాదిస్తున్నాను . చల్లని చిరు గాలి వీస్తున్నది . పువ్వులన్ని ఆ చిరుగాలికి తలలు ఊపుతూ వున్నయి . ఒక్క పువ్వు మాత్రం తల వంచుకొని కనిపించింది . ఆ పూల మధ్యలోనే ఒక భ్రమరం ఘీంకారం చేస్తూ అటూ ఇటూ పరిభ్రమిస్తూ వున్నది . ఆ తుమ్మెద రాక కొసం యెదురు చూపులతో ఆ చిన్నారి పుష్పం పడిన మనొ వేదనే ఈ కవిత....
అరవిరసిన మొగ్గనై
సుగంధాలు వెదజల్లె సిరిమల్లెనై
అందాలొలుకు మల్లికనై
చిరుగాలితో వూసులాడు కోమలాంగినై
మధువు దాచిన పుష్పాంగినై
మధువుతొ బరువైన తలవంచిన సుకుమరినై
ఎదురు చూపుల చకోరినై
పరిమళ సుధా బింధువులు వొలికించక
ఆ తేనె మాదురిని గ్రోల
తుమ్మెదవై నన్ను చేరు
నీకై వొడిసి పట్టి
విరహ వెదనతో వేచియున్న
మగువ మనసెరిగి దరి చేర
రావా.........ప్రియతమ
Monday, December 21, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment