నయనాల మెరిసిన హరివిల్లు మాయమై
కన్నీటి తెరలు కమ్మగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతుంటే
ఆవేదన రగిలింది నాలో నేడు....
ఆవేదన రగిలింది నాలో నేడు....
హృదయాన విరిసిన వసంతం గ్రీష్మమై
మంటలు చెలరేగగా
మంటలు చెలరేగగా
మాయమైన ఆ వసంతాన్ని వెతుకుతుంటే
ఆవేదన రగిలింది నాలో నేడు ......
ఆవేదన రగిలింది నాలో నేడు ......
పన్నీటి పూల జల్లులు నిప్పురవ్వలై
నన్ను నిలువున దహించగ
మాయమైన ఆ జల్లుల్ని వెతుకుతుంటే
ఆవేదన రగిలింది నాలో నేడు.... .
నన్ను నిలువున దహించగ
మాయమైన ఆ జల్లుల్ని వెతుకుతుంటే
ఆవేదన రగిలింది నాలో నేడు.... .
గగనాన విరగ బూసిన వెన్నెల
వేడి సెగలు గ్రక్కుతూ మరిగిస్తుంటే
మాయమైన ఆ వెన్నెలని వెతుకుతుంటే
వేడి సెగలు గ్రక్కుతూ మరిగిస్తుంటే
మాయమైన ఆ వెన్నెలని వెతుకుతుంటే
ఆవేదన రగిలింది నాలో నేడు.....
వీచే చల్లని పైరగాలి వడగాడ్పులై
నన్ను కాల్చుతుంటే
మాయమైన ఆ ఛల్లదనాన్ని వెతుకుతుంటే
ఆవేదన రగిలింది నాలో నేడు..... 

0 comments:
Post a Comment