Powered By Blogger

Monday, December 21, 2009

అరవిరసిన మొగ్గనై

ఒక  రోజు  నేను  మా  పెరటిలో  విరపూసిన  పువ్వులను  ఆస్వాదిస్తున్నాను . చల్లని  చిరు  గాలి  వీస్తున్నది . పువ్వులన్ని  ఆ  చిరుగాలికి  తలలు  ఊపుతూ  వున్నయి .  ఒక్క  పువ్వు  మాత్రం  తల  వంచుకొని  కనిపించింది . ఆ  పూల మధ్యలోనే  ఒక  భ్రమరం  ఘీంకారం  చేస్తూ  అటూ  ఇటూ  పరిభ్రమిస్తూ  వున్నది . ఆ  తుమ్మెద  రాక కొసం  యెదురు  చూపులతో  ఆ  చిన్నారి  పుష్పం  పడిన   మనొ  వేదనే  ఈ  కవిత....     







అరవిరసిన  మొగ్గనై
సుగంధాలు  వెదజల్లె  సిరిమల్లెనై

అందాలొలుకు  మల్లికనై
చిరుగాలితో  వూసులాడు  కోమలాంగినై
 
మధువు  దాచిన  పుష్పాంగినై    
మధువుతొ  బరువైన  తలవంచిన   సుకుమరినై

ఎదురు  చూపుల  చకోరినై 
పరిమళ  సుధా  బింధువులు  వొలికించక

ఆ  తేనె  మాదురిని  గ్రోల 
తుమ్మెదవై  నన్ను  చేరు

నీకై  వొడిసి  పట్టి 
విరహ  వెదనతో   వేచియున్న

మగువ  మనసెరిగి  దరి  చేర 
రావా.........ప్రియతమ  

ఆవేదన రగిలింది నాలో నేడు

నయనాల  మెరిసిన  హరివిల్లు  మాయమై 
కన్నీటి  తెరలు  కమ్మగా 
మాయమైన  ఆ  క్షణాన్ని  వెతుకుతుంటే   
ఆవేదన  రగిలింది  నాలో  నేడు....  



హృదయాన  విరిసిన  వసంతం   గ్రీష్మమై
మంటలు   చెలరేగగా 

మాయమైన   ఆ  వసంతాన్ని  వెతుకుతుంటే 
ఆవేదన  రగిలింది  నాలో  నేడు ......



పన్నీటి  పూల  జల్లులు  నిప్పురవ్వలై     
నన్ను  నిలువున  దహించగ
మాయమైన  ఆ  జల్లుల్ని  వెతుకుతుంటే 
ఆవేదన  రగిలింది  నాలో  నేడు.... .



గగనాన  విరగ  బూసిన  వెన్నెల
వేడి  సెగలు  గ్రక్కుతూ  మరిగిస్తుంటే 
మాయమైన  ఆ   వెన్నెలని  వెతుకుతుంటే  

ఆవేదన  రగిలింది  నాలో  నేడు..... 


వీచే  చల్లని  పైరగాలి  వడగాడ్పులై  
నన్ను  కాల్చుతుంటే  
మాయమైన  ఆ  ఛల్లదనాన్ని  వెతుకుతుంటే   
ఆవేదన  రగిలింది  నాలో  నేడు.....  



గడ్డి పూలు

గడ్డి పూలు--ఈ గడ్డి పూలు దేవుని  పూజకు నోచుకొవు. అవి ఎంధుకు పనికి రావని  అందరం వటిని  యెంతొ చులకన గా చూస్తాము.     ఈ భగవంతుని  సృష్టిలొ వాటికంటూ   ఒక  సుస్థిర  స్తానాన్ని  ఏర్పరచుకొని   యెంతొ  అందముగ    సప్తవర్ణలలొ    విరబూసి  మన  మనసులను  దోస్తయి . అవి కనపడితె   చాలు  మనకు తెలియకుండనె  మన అడుగులు  వాటి   వైపు పడతాయి    మనల్ని చుసి ముసిముసిగ అందంగా నవ్వుతూ   రమ్మని స్వాగతిస్తాయి .  అలసిన మన మనసులకు  అవి ఎంతొ   సేద   తీరుస్తాయి.    హాయిని ఇస్తాయి . మౌనంగా   మనకి   ఎన్నొ     పాఠాలు    చెబుతాయి.    ఇంకెన్నొ  అనుభవాలు   నెర్పుతాయి . అయిన  అవి గడ్డి పూలని మన అనందరికి లొకువె.             

Saturday, December 19, 2009

ఎవరొ నీ వెవరొ...

నా   యద  పై
 చినుకువై   రాలి
ఏరువై   పారి
అలలవై   ఎగసి
వరదవై     పొంగి
ఉప్పెనగా    మారి 
నా   హృదయ   లోతుల్లో 
ప్రలయాన్ని   సృష్టించిన
 ఎవరో   నీ   వెవరో ................





Friday, December 18, 2009

అమ్మ


సృష్టి     జరిపేదే    అమ్మ
నవమాసాలు   మోసి..... కనేదే   అమ్మ
నీవు   గుండెల  మీద   తన్తుంటే.... ఆనందించేదే   అమ్మ  
నీకు   కొసరి   కొసరి  గోరు   ముద్దలు.....తినిపించేదే   అమ్మ
నీ    చేత    తప్పటడుగులు   వేయిస్తూ......సంతోషించేదే అమ్మ 
నీవు   తడబడి   క్రింద   పడితే..... తల్లడిల్లేదే    అమ్మ     
నీవు    ముద్దు    ముద్దు గా    మాట్లాడుతుంటే..... మురిసిపోయేదే    అమ్మ




నీ    తప్పొప్పులు   సరిదిదేదే   అమ్మ.....అందుకే   నీ   మొదటి   గురువు   అమ్మ
నీ    కష్టాలలో   అండగా..... నిలిచేదే   అమ్మ
నిన్ను   కంటికి   రెప్పలా....... కాపడుకునేదే   అమ్మ
నీవు     ప్రతి    నిమిషం   తప్పటడుగు   వేయకుండా...... హెచ్చారించేదే   అమ్మ 




భగవంతుని కి   మారుగా  నీ   ఎదుట......నిలిచిందే    అమ్మ
ఆ    దేవుడు    కూడా   పంచలేని........ ప్రేమే    అమ్మ 
ఆ   దైవం   కూడా   అమ్మ   ప్రేమకై   పదే   పదే   జన్మిస్తుంటాడు 
అందుకే   ఆమె   ఈ   లోకానికే   కాదు   ఆ   దైవానికే   అమ్మ




వెన్న   కన్నా  సుతి   మెత్తని   ప్రేమ....... అమ్మ 
పాల    నురగ   కన్నా   తెల్లని     ప్రేమ......... అమ్మ 
వెన్నెల    కన్నా    చల్లని      ప్రేమ......... అమ్మ  
మకరందం    కన్నా    తీయని      ప్రేమ...... అమ్మ 
ఈ     జగత్తులోని     ప్రేమమయం........ అమ్మ
ఈ    విశ్వంలోని      అమృతమయం....... అమ్మ




ఆకాశాన్ని    మూట     కట్టవచ్చు
భూమిని    చాపలా     చుట్టవచ్చు 
సప్త సముద్రాల    లోతు   ఎంతో   కొలవవచ్చు 
గగనంలోని    నక్షత్రాలను    లెక్కపెట్టవచ్చు 
సూర్యుడిని    అర    చేత   పట్టవచ్చు 
గాలిని     గుప్పెట     ముయవచ్చు
కానీ..................
అమ్మ .. అమ్మ ప్రేమ  వర్ణింపలేనివి




అమ్మ   ప్రేమని   యింకా   వర్ణించాలని   వుంది ......కానీ   
నా   భావాలూ    నా   మనసుకు   నా   భాషకు   అందనంటున్నాయి.
ఈ కవిత నా మాతృ మూర్తి పాద పద్మలకు అర్పితం .......